వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతలేళ్ల వెంకట్ రెడ్డి సి కె న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాతిరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం అధిక ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడగాలుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఎండవేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, …

వడదెబ్బ తగలకుండా అప్రమత్తంగా ఉండాలి

కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత
లేళ్ల వెంకట్ రెడ్డి

సి కె న్యూస్ వైరా నియోజకవర్గ ప్రతినిధి బాదావత్ హాతిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం అధిక ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా వడగాలుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

ఎండవేడిమి ఉండే సమయాల్లో వీలైనంతవరకు బయటకు రాకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితిల్లో బయటకు వచ్చే పక్షంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు.ఈ వేసవిలో లూజుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ల వెంకట్ రెడ్డి తెలిపారు.

ముఖ్యంగా గర్భిణీలు, వృద్ధులు, చిన్నపిల్లల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట అనవసరంగా తిరగకూడదు. కలుషిత ఆహారాన్ని తినకూడదు.మాంసాహారాన్ని, మసాలాలను తగ్గించాలి. మద్యం సేవించకూడదు.

ఎండ నుంచి రక్షణ కల్పించేందుకు టోపీలు,గొడుగులు వినియోగించాలని కాంగ్రెస్ నేత లేళ్ల వెంకట్ రెడ్డి తెలిపారు.బయటకు వెళ్లేటప్పుడు నీళ్లు త్రాగి వెళ్లాలి. ఎక్కువగా ద్రవపదార్ధాలను, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, ఓఆర్ఎస్ లాంటి ద్రావకాలను తీసుకోవాలన్నారు.

Updated On 10 April 2024 10:55 AM IST
cknews1122

cknews1122

Next Story