KhammamTelangana

ఇరు వర్గాల దాడి యస్ ఐ కు గాయాలు

ఇరు వర్గాల దాడి యస్ ఐ కు గాయాలు

కామేపల్లి: మండలంలోని పండితాపురంలో పాతకక్ష్యల నేపథ్యాన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగాది పండగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్ల ప్రభలతో ఉరేగింపు నిర్వహించారు. ఈక్రమంలో కొమ్మినేపల్లి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చల్లా హరి తన కుమారుడు జానుతో ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా కాంగ్రెస్‌కు చెందిన పలువురు అడ్డుకుని హరిపై దాడి చేశారు. ఆతర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన పలువురి కార్యకర్తల ఇళ్లపై దాడి చేస్తుండగా..

అడ్డుకున్న వారు కాంగ్రెస్‌ నేతలపై దాడులకు దిగారు. ఈఘటనలో బీఆర్‌ఎస్‌కు చెందిన జాను, లక్ష్మి, ద్రాక్ష, లాలయ్య, అప్పారావు, వెంకన్న, భ్యూలా, సులోమానుతో పాటు కాంగ్రెస్‌కు చెందిన బండి ఉపేందర్‌, నాగరాజు, బొమ్మగాని పిచ్చయ్య, రాకేష్‌, బుడిగ సీతకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలిసిన బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు హన్మంతరావు తమ కార్యకర్తలను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కారులో వస్తుండగా కాంగ్రెస్‌ నేతలు దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌, సిబ్బందితో చేరుకుని ఇరువర్గాలను చెదరకొట్టారు. ఈక్రమంలోనే ఎస్‌ఐ తలకు సైతం గాయమైంది. ఘటనా స్థలానికి ఏసీపీ తిరుపతిరెడ్డి చేరుకుని విచారణ చేపట్టడంతో పాటు బందోబస్తు ఏర్పాటు చేయగా ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button