చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేడియా డిస్టిల్లరీ కార్మికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. దీంతో 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
ఈ ఘటన దుర్గ్ జిల్లాలో జరిగింది. SDRF, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని హాస్పిటళ్లకు తరలించారు.
డిస్టలరీ కార్మికులు షిఫ్ట్ ముగిసి ఇంటికి వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగిందన్నారు ఎస్పీ జితేంద్ర శుక్లా. ప్రమాదం విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ కార్మికులను వివిధ హాస్పిటళ్లకు తరలించారన్నారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఎయిమ్స్ కు పంపించామన్నారు. ప్రమాదంపై మేజిస్టేరియల్ విచారణ చేస్తున్నామన్నారు డీఎం రిచా ప్రకాశ్ చౌదరి.
గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామంటూ ట్వీట్ చేశారు విష్ణుదేవ్ సాయి. మరోవైపు దుర్గ్ లో జరిగిన ప్రమాదకరమన్నారు ప్రధాని మోదీ. ఆత్మీయులను కోల్పోయిన వారి సానుభూతి ప్రకటిస్తున్నట్టు ట్వీట్ చేశారు.
ఈ ఘటనలో ప్రమాదస్థలంలో 11 మంది, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నలుగురు మరణించారు. 12 మందికిపైగా గాయపడ్డారు. ఓ డిస్టిలరీ కంపెనీలో పనిచేస్తున్న 30 మంది ఉద్యోగులను ఇళ్లకు తీసుకొస్తున్న బస్సు కుమ్హారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఖాప్రీ గామం సమీపంలో ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్కుకు జారి 40 అడుగుల లోతున్న గోయ్యిలో పడినట్లు సమాచారం.