కూల్‌డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగి రెండేండ్ల బాలుడు మృతి నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగి రెండేండ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు.నెల్లూరు నగరంలోని ఇరుగాళమ్మ కట్టలో షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులు నివసిస్తున్నారు. షేక్‌ కరిముల్లా చికెన్‌ సెంటర్‌లో, అమ్ము చేపల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కరిష్మా, కాలేషా ( 2) ఉన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా.. …

కూల్‌డ్రింక్‌ అనుకొని పెట్రోల్‌ తాగి రెండేండ్ల బాలుడు మృతి

నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కూల్‌డ్రింక్‌ అనుకుని పెట్రోల్‌ తాగి రెండేండ్ల బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశాడు.నెల్లూరు నగరంలోని ఇరుగాళమ్మ కట్టలో షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులు నివసిస్తున్నారు.

షేక్‌ కరిముల్లా చికెన్‌ సెంటర్‌లో, అమ్ము చేపల దుకాణంలో పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కరిష్మా, కాలేషా ( 2) ఉన్నారు. ఈ నెల 7వ తేదీన సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ ఆలయం వద్ద పనిచేస్తుండగా..

తల్లితో వెళ్లిన కాలేషా అక్కడే ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో పిల్లాడికి ఒక పెట్రోల్‌ బాటిల్‌ కనబడింది. అది చూసిన కాలేషా కూల్‌డ్రింక్‌ అనుకుని తాగేశాడు.

ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. పిల్లాడు స్పృహతప్పి పడిపోవడం గమనించిన తల్లి అమ్ములు వెంటనే కాలేషాను ఆస్పత్రికి తీసుకెళ్లింది.

అక్కడే చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై బాధిత తల్లిదండ్రులు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

Updated On 10 April 2024 11:02 PM IST
cknews1122

cknews1122

Next Story