ప్రజా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులను గెలిపించండి భువనగిరి సిపిఐ (ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్* సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి(రాజు ) ఏప్రిల్10: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనగిరి పార్లమెంటు సిపిఐ (ఎం ) అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ అడ్డగూడూరు మండలం అభివృద్ధిలో వెనక పడడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నారు, అడ్డగూడూరు మండలానికి బునాదిగాని కాలువ తీసుకువస్తామని గత పది పదిహేను …

ప్రజా సమస్యలపై పోరాడుతున్న కమ్యూనిస్టులను గెలిపించండి

భువనగిరి సిపిఐ (ఎం) ఎంపీ అభ్యర్థి ఎండి జహంగీర్*

సికే న్యూస్ అడ్డగూడూర్ ప్రతినిధి(రాజు ) ఏప్రిల్10:

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భువనగిరి పార్లమెంటు సిపిఐ (ఎం ) అభ్యర్థి ఎండి జహంగీర్ మాట్లాడుతూ అడ్డగూడూరు మండలం అభివృద్ధిలో వెనక పడడానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నారు,

అడ్డగూడూరు మండలానికి బునాదిగాని కాలువ తీసుకువస్తామని గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎన్నికల సమయంలో మాటలు చెబుతున్నారు, ఏదైనా ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి గెలిచినంక ప్రజలని ప్రజా సమస్యలను పట్టించుకోవట్లేదు అన్నారు,

ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కమ్యూనిస్టులతోనే సాధ్యమన్నారు,స్థానిక సమస్యల ఎజెండగా పేదల కోసం పోరాడే కమ్యూనిస్టులను గెలిపించాలన్నారు, ఈ కార్యక్రమంలో బొల్లు యాదగిరి, బుర్రు అనిల్ , సిపిఐ (ఎం ) మండల నాయకులు చిత్తలూరి మల్లయ్య శీలం శ్రీను చిత్తలూరి స్వామి కార్యకర్తలు పాల్గొన్నారు

Updated On 10 April 2024 5:27 PM IST
cknews1122

cknews1122

Next Story