శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు
సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం
స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ఐదవ తరగతిని పూర్తిచేసుకుని ఆరవ తరగతిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా విద్యార్థులతో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నిర్వహించడం జరిగింది.
సందర్భంగా ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ మాట్లాడుతూ 5వ తరగతి నుంచి పై తరగతికి వెళ్తున్నామనే ఒక ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని చదువు పట్ల ఇష్టాన్ని కలిగించే ఒక అంశంగా గ్రాడ్యుయేషన్ డే గురించి వివరించడం జరిగిందన్నారు
ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీ మల్లెంపాటి శ్రీధర్ , డైరెక్టర్ శ్రీమతి శ్రీవిద్య , పాఠశాల ప్రిన్సిపాల్ పివిఆర్ మురళీమోహన్ , వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి నివేదిత , ప్రైమరీ ఇన్చార్టులు ఆశా దేవి, రమాదేవి మరియు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.