కేసీఆర్ కు మరో షాక్… కాంగ్రెస్ లోకి ఇంద్రకరణ్
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌కు షాక్ తగలనుందా?ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కారు దిగి హస్తంను అందుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఇప్పటికే సీనియర్ నేత కేశవరావుతో చర్చలు జరిపిన ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్‌లో చేరికకు సుముఖత వ్యక్తం చేయగా కాంగ్రెస్ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే వెంటనే చేరే అవకాశం ఉంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఈ ఇద్దరు నేతలు పార్టీతో అంటిముట్టనట్లుగా ఉన్నారు. ముఖ్యంగా ఇంద్రకరణ్ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు.
కేసీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. కానీ ఇటీవల పార్టీతో పాటు ఇంద్రకరణ్ సైతం ఓటమి పాలు కావడంతో కారు దిగేందుకు సిద్ధమయ్యారు.
అయితే వీరిద్దరి రాకను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంద్రకరణ్ ఆస్తులు కాపాడుకోవానికే వస్తుండగా మంచిర్యాలలో అరవింద్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అయితే లోకల్ కేడర్ వ్యతిరేకిస్తున్న అధిష్టానం తీసుకున్న నిర్ణయమే ఫైనల్ కావడంతో త్వరలోనే వీరిద్దరూ పార్టీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.