ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కోసం పొలాల వెంట తిరుగుతున్న పోరాటయోధుడు కేసీఆర్
కళ్ళ ముందే పంటలు ఎండుతున్న నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం
వచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరువే ఎక్కువ
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 12
కళ్ళ ముందే పంటలు ఎండుతున్న నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదని ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కోసం పంటల వెంట తిరుగుతున్న పోరాటయోధుడు కేసీఆర్ అని మాజీ మంత్రి సూర్యపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
నల్లగొండ పార్లమెంటు. హుజుర్ నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం హుజూర్నగర్ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే శ్రీ గుంట కండ్ల జగదీశ్వర్ రెడ్డి హాజరై. మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు రాక నానా ఇబ్బందులు పడుతున్నారని
బి ఆర్ఎస్ హయంలో ఇదే రకంగా కరువు వచ్చిన రైతుల పక్షాన నిలబడి నాగార్జునసాగర్ లో కొద్దిపాటి నీళ్ళు నిల్వ ఉన్న సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నీటిని అందించామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడి చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని దానికి మద్దతు బిజెపి ప్రభుత్వం పలుకుతుందని
రాష్ట్రంలో రైతుల కొరకు కేసిఆర్ ప్రభుత్వం ఎంతో చేసిందని వంద రోజుల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వాటి ఊసే లేదని తెలంగాణ హక్కుల కొరకు రైతంగం కొరకు పోరాడే ఏకైక నాయకుడు కేసీఆర్ అని ఇప్పుడు వచ్చిన కరువు కంటే కాంగ్రెస్ తెచ్చిన కరివే ఎక్కువైందని సంక్షేమ పథకాలు అమలు విషయంలో 100 రోజుల్లో అన్ని అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ వాటి ఊసే లేదని ఎద్దేవా చేశారు.
నల్లగొండ పార్లమెంటు బిఆర్ యస్ పార్టీ అభ్యర్థి కంచెర్ల కృష్ణారెడ్డి గెలుపు కై ప్రతి ఒక్కరు పార్టీ గెలుపు కై కష్టపడి పని చేసి కారు గుర్తుని. అత్యదిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. ఈకార్యక్రమంలో నల్లగొండ మాజీ ఎమ్మెల్యే. కంచర్ల భూపాల్ రెడ్డి మాజీ రాజ్యసభ సభ్యుడు. సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు. బడుగుల లింగయ్య యాదవ్.
కోదాడ మాజీ ఎమ్మెల్యే. బోల్లంమల్లయ్య యాదవ్. బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హుజుర్ నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల. జడ్పిటిసిలు లు ఎంపీపీలు. మున్సిపల్ చైర్మన్ లు వైస్ చైర్మన్ లు. కౌన్సిలర్లు. మార్కేట్ కమిటీ చైర్మన్ లు వైస్ చైర్మన్ లు. మండల అధ్యక్షులు. ప్రధానకార్యదర్శులు సర్పంచ్ లు వార్డు సభ్యులు. మహిళా సంఘాలు. యూత్ సంఘాలు. రైతులు. అన్ని వర్గాల ప్రజలు అదిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.