సీఎం జగన్ పై జరిగిన దాడిపై స్పందించిన షర్మిల తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అన్నారు. ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే …

సీఎం జగన్ పై జరిగిన దాడిపై స్పందించిన షర్మిల

తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై దాడి జరిగి ఎడమకంటి పైన గాయం కావటం బాధాకరం, దురదృష్టకరం అన్నారు.

ఇది ప్రమాదవశాత్తు అయిందని అనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా ఎవరైనా కావాలని చేసి ఉంటే ప్రతిఒక్కరు ఖచ్చితంగా ఇలాంటి ఘటనను ఖండించాల్సిందే అన్నారు.

ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని, హింసను ప్రతి ప్రజాస్వామిక వాదులు అంతా ఖండించాల్సిందే అని పేర్కొన్న వైఎస్ షర్మిల.. సోదరుడు జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఏపీ సీఎం జగన్ పై జరిగిన రాయి దాడిని వైసీపీ నేతలు, తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తావు లేదన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎదుర్కోలేక భయంతో జగన్ పై రాయి దాడి చేయించారని టీడీపీ నేతలపై మంత్రి అంబటి రాంబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్, మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టి నిందితులు, దీనికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారన్నారు.

చంద్రబాబు దాడి చేయించారనిఆరోపణలు..
సీఎం జగన్పై పచ్చ గూండాలతో టీడీపీ అధినేత చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ నేతలు ఆరోపించారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు వస్తున్న అపూర్వ ప్రజాదరణను చూసి ఓర్వలేక

టీడీపీ నేతలు చేసిన పిరికిపంద చర్య అని వైసీపీ మండిపడుతోంది. వైసీపీ కార్యకర్తలు అందరూ సంయమనం పాటించాలని సూచించారు. జగన్ పై జరిగిన రాళ్ల దాడికి ఏపీ ప్రజలు మే 13న సమాధానం చెప్తారని సూచించారు.

*జగన్ దాడి పై స్పందించిన కేటీఆర్…*

*జాగ్రత్త అన్న అంటూ పోస్ట్*

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడిని వైసీపీ నేతలతోపాటు , తెలంగాణ నేతలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. విజయవాడలో సీఎం జగన్ పై రాళ్లదాడిని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేస్తూ తీవ్రంగా ఖండించారు.

జాగ్రత్తగా ఉండాలి జగన్ అన్న..అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు హింసలకు ఎలాంటి తావులేదని..ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని తన పోస్టులో కోరారు కేటీఆర్.

కాగా విజయవాడ సింగ్ నగర్ డాబా కోట్ల సెంటర్ వద్ద 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో సీఎం జగన్ పై కొందరు ఆగంతకులు రాళ్లు విసరడం కలకలం రేపింది. సీఎం జగన్ కు ఓవైపు పూలు చల్లుతుండగా.. మరో వైపు కొందరు ఆగంతకులు రాళ్లు విసిరారు.

ఈ ఘటనలో సీఎం జగన్ ఎడమ కంటికి రాయి తగిలింది. రాయి బలంగా తగలడంతో ఆయన ఎడమ కన్ను వాచింది. సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో MLA వెల్లంపల్లి ఎడమ కంటికిసైతం గాయం అయింది.

Updated On 14 April 2024 12:03 AM IST
cknews1122

cknews1122

Next Story