పోలీస్ వారి హెచ్చరిక ఖమ్మం టూ టౌన్ పోలీస్ వారు, ఖమ్మం పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, తేదీ 13-4-20 24న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో ఖమ్మం రోటరీ నగర్ లో FZ మోటార్ సైకిల్ పై ఆకుపచ్చ షర్టు ధరించి, ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వైపు నుండి బైక్ పై ఎదురుగా వెళ్లి, నడిచి వెళుతున్న ఒక ఆడ మనిషి మెడలో ఉన్న …

పోలీస్ వారి హెచ్చరిక

ఖమ్మం టూ టౌన్ పోలీస్ వారు, ఖమ్మం పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, తేదీ 13-4-20 24న ఉదయం సుమారు 11:30 గంటల సమయంలో ఖమ్మం రోటరీ నగర్ లో FZ మోటార్ సైకిల్ పై ఆకుపచ్చ షర్టు ధరించి, ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం వైపు నుండి బైక్ పై ఎదురుగా వెళ్లి, నడిచి వెళుతున్న ఒక ఆడ మనిషి మెడలో ఉన్న బంగారు చైను ను లాక్కొని వెళ్లే ప్రయత్నం చేయగా, ఆ మహిళ ఆ చైన్ ను గట్టిగా పట్టుకొని అరవగా, గుర్తుతెలియని వ్యక్తి అటు నుండి బైపాస్ వైపుకు పారిపోయినాడు. పై ఫోటోలో కనబడుతున్న వ్యక్తి ని ఎవరైనా గుర్తించి నట్లయితే ఖమ్మం టూ టౌన్ SHO సెల్ నెంబర్:8712659110 కు గాని ACP ఖమ్మం టౌన్ సెల్ నెంబర్ :8712659105 కు గాని సమాచారం ఇవ్వగలరు.వారికి పోలీస్ శాఖ తరపున తగిన పారితోషకం ఇవ్వబడుతుంది. కావున ఖమ్మం పట్టణ ప్రజలు గుర్తుతెలియని బైకులపై,ఎదురుగా మన వెనుక నుండి వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసు వారి సూచన.

Updated On 14 April 2024 1:56 PM IST
cknews1122

cknews1122

Next Story