
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుదాం..
రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
అన్ని ప్రాంతాల్లో అత్యధిక స్థానాలను గెలిపించుకుందామని పిలుపు
కొత్తగూడెం నియోజకవర్గంలో నాలుగు మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమావేశాల నిర్వహణ
కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం ఇన్ చార్జ్ గా ఎంపీ రఘురాం రెడ్డి నియామకం కొత్తగూడెం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకుని హస్తం పార్టీ సత్తా చాటుదామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం కొత్తగూడెంలోని విద్యానగర్ కాలనీ లో గల పొంగులేటి క్యాంపు కార్యాలయంలో…. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఆళ్ల మురళి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గం లోని చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవి పల్లి, పాల్వంచ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశాలకు హాజరై మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గ ఇన్ చార్జ్ గా ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డిని నియమించినట్లు మంత్రి పొంగులేటి ప్రకటించగా.. కొత్తగూడెం నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ఇంటింటా వివరించండి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన ఆరు గ్యారెంటీలు, అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు.
రైతు రుణమాఫీ, మహిళకు ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, పేదలకు రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం సరఫరా..ఇలా మన పథకాలన్నింటినీ ప్రజలకు వివరించి చెప్పాలని కోరారు.
ఖజానాను లూటీ చేసిన గత ప్రభుత్వం..
పదేళ్లు పాలించిన బీఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిందని, కుంగిన కాళేశ్వరం, దరిద్రపు ధరణి పేరిట ప్రజల సొమ్మునుదుర్వినియోగం చేశారని అన్నారు. ఇచ్చిన హామీలను నిలుపుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పారు.
అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అందించామని నియోజకవర్గానికి మరో 1,500 ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతున్నామని వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చారిత్రాత్మకం
దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేపట్టి ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా 42శాతం రిజర్వేషన్ ను అమలు చేసి రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని కూడా నెరవేర్చామని రాష్ట్ర మంత్రి పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని ఓటు బ్యాంక్ ఉందని.. మన సత్తాను చాటి చెబుదామని పిలుపునిచ్చారు.
ఈ సమావేశాల్లో..: తూము చౌదరి, పెద్దబాబు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, ఐఎన్టీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ.రజాక్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తి తదితరులు పాల్గొన్నారు.