ఈనెల 18న ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు…
ఈనెల 18న ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు… గైరు హాజరు అయిన వారందరూ తప్పనిసరిగా హాజరు కావలి…. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 15 ఈ నెల 1, 2, 4, 5 తేదీలలో మొదటి విడుత పోలింగ్ ఆఫీసర్,అదర్ పోలింగ్ ఆఫీసర్ల ఎన్నికల శిక్షణా కార్యక్రమాలకు గైరు హాజరు అయిన సిబ్బంది కొరకు ప్రత్యేకంగా ఈనెల 18 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటల నుండి …

ఈనెల 18న ఎన్నికల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు…
గైరు హాజరు అయిన వారందరూ తప్పనిసరిగా హాజరు కావలి….
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 15
ఈ నెల 1, 2, 4, 5 తేదీలలో మొదటి విడుత పోలింగ్ ఆఫీసర్,అదర్ పోలింగ్ ఆఫీసర్ల ఎన్నికల శిక్షణా కార్యక్రమాలకు గైరు హాజరు అయిన సిబ్బంది కొరకు ప్రత్యేకంగా ఈనెల 18 వ తేదీన మధ్యాహ్నం 1.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు భువనగిరి పట్టణంలోని వెన్నెల కాలేజీలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయబడిందని,గైరు హాజరు అయిన వారందరూ తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే నేడొక ప్రకటనలో తెలిపారు.

ఈ శిక్షణా కార్యక్రమానికి ఎవరికీ మినహాయింపు లేదని,ఎవరైనా గైరు హాజరు అయినట్లయితే సిసిఎ రూల్స్, ప్రజాప్రాతినిథ్యం చట్టం 127 ప్రకారం చర్యలతో పాటు,క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టరు ఒక ప్రకటనలో హెచ్చరించారు.
