ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించిన మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి
ఘనంగా రామేశ్వరం బండ గ్రామంలో అంబేద్కర్ జయంతి నిర్వహించిన మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి సీ కే న్యూస్ ప్రతినిధి, పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండలంలోని రామేశ్వరం బండ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలను గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయనతో పాటు గ్రామ పెద్దలు యువకులు అంబేద్కర్ కు నినాదాలు ఇస్తూ పూలమాలలు …
![ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించిన మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఘనంగా అంబేద్కర్ జయంతి నిర్వహించిన మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి](https://cknewstv.in/wp-content/uploads/2024/04/IMG-20240415-WA0008.jpg)
ఘనంగా రామేశ్వరం బండ గ్రామంలో అంబేద్కర్ జయంతి నిర్వహించిన మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి
సీ కే న్యూస్ ప్రతినిధి, పటాన్చెరు నియోజకవర్గం
పటాన్చెరు మండలంలోని రామేశ్వరం బండ గ్రామంలో ఆదివారం అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలను గ్రామ మాజీ సర్పంచ్ ధరణి అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఆయనతో పాటు గ్రామ పెద్దలు యువకులు అంబేద్కర్ కు నినాదాలు ఇస్తూ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అలాగే ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మరియు యువకులను ఘనంగా సన్మానించడం జరిగింది
అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ అంకిరెడ్డి మాట్లాడుతూ రామేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలో యువకులు అంబేద్కర్ యువజన సభ్యులు అందరూ కలిసికట్టుగా ఉండి ఆ మహనీయుని జ్ఞాపకాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు యువకులు తదితరులు పాల్గొన్నారు
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)