జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మార్త వెంకటేష్ సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 15 రాజపేట మండల కేంద్రానికి చెందిన మార్త వెంకటేశం యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారిగా కొనసాగుతున్న ఆయనను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. రాజపేట శ్రీ మణికంఠ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ గా, రాజాపేట కన్యకా పరమేశ్వరి బిన్నీ రైస్ మిల్ ఫౌండేషన్ …

జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మార్త వెంకటేష్

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 15

రాజపేట మండల కేంద్రానికి చెందిన మార్త వెంకటేశం యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కోశాధికారిగా కొనసాగుతున్న ఆయనను అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.

రాజపేట శ్రీ మణికంఠ రైస్ మిల్ మేనేజింగ్ పార్ట్నర్ గా, రాజాపేట కన్యకా పరమేశ్వరి బిన్నీ రైస్ మిల్ ఫౌండేషన్ పార్ట్నర్,శ్రీ కన్యకా పరమేశ్వరి పారాబైల్డ్ రైస్ మిల్ కోనూరు మేనేజింగ్ పార్ట్నర్ గా ఆయన కొనసాగుతున్నారు.

ఈ సందర్భంగా రాజపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉప్పల రమేష్,రాజపేట మండల ఆర్యవైశ్యులు, ప్రధాన కార్యదర్శి ఉప్పల సిద్ధి లింగం, యువజన విభాగం అధ్యక్షులు నంగునూరు రాజు, శ్రీ రామకృష్ణ మందిరం ఆలయ ట్రస్ట్ సభ్యులు అభివృద్ధి సేవా సమితి సభ్యులు హర్షం వ్యక్తం చేసి మార్త వెంకటేశను అభినందించారు. సోషల్ మీడియా ద్వారా అన్ని పార్టీల నాయకులు పలువురు అభినందించారు.

Updated On 15 April 2024 6:40 PM IST
cknews1122

cknews1122

Next Story