ఎమ్మెల్యే కూనంనేని పై కేసు నమోదు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 16, భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పై కేసు నమోదు అయింది. పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు. ఎన్నికల కోడ్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కూనంనేని సమావేశం నిర్వహించారంటూ ఫిర్యాదులో పేర్కొన్న అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి. సెక్షన్ …

ఎమ్మెల్యే కూనంనేని పై కేసు నమోదు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,

ఏప్రిల్ 16,

భద్రాధ్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం ఎమ్మెల్యే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పై కేసు నమోదు అయింది. పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.

ఎన్నికల కోడ్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కూనంనేని సమావేశం నిర్వహించారంటూ ఫిర్యాదులో పేర్కొన్న అధికారి విజయ్ భాస్కర్ రెడ్డి.

సెక్షన్ 188, 171- సీ కింద ఎమ్మెల్యే కూనంనేని పై కేసు నమోదు చేసిన పాల్వంచ పోలీసులు.

మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఎమ్మెల్యే కూనంనేని ఉల్లంఘించారని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్.

Updated On 16 April 2024 6:11 PM IST
cknews1122

cknews1122

Next Story