ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు…. సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 16 ఆలేరు పట్టణంలోని 186 197 బూతులలో భారతీయ జనత పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా 186 197 బూత్ ఓటర్లను కలిసి పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మూడోసారి దేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ రావాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు …

ఇంటింటి ప్రచారం చేపట్టిన బీజేపీ నాయకులు….

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 16

ఆలేరు పట్టణంలోని 186 197 బూతులలో భారతీయ జనత పార్టీ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా 186 197 బూత్ ఓటర్లను కలిసి పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మూడోసారి దేశ ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ రావాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతూ కేంద్రంలో చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు కరపత్రం ద్వారా వివరించుకుంటూ ఇంటికి స్టిక్కర్ వేస్తూ ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తునికి దశరథ,భారతీయ జనతా పార్టీ ఆలేరు పట్టణ ప్రధాన కార్యదర్శి కళ్లెం రాజు,భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా అధ్యక్షుడు సుక్కరాజు,186 బూత్ అధ్యక్షుడు పాశికంటి సోమయ్య197 బూతు అధ్యక్షుడు పరమని స్వామి పాల్గొన్నారు..

Updated On 16 April 2024 2:03 PM IST
cknews1122

cknews1122

Next Story