ఎంపీ ఎన్నికల తర్వాత బి ఆర్ఎస్ ఖాళీ అవుతుంది
10 సంవత్సరాలలో దేశానికి మోడీ చేసింది ఏమీ లేదు
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీనే
భారీగా హాజరైన కార్యకర్తలు అభిమానులు
పటిష్ట భద్రత నడుమ సన్నాహక సభ
హుజూర్ నగర్ ,కోదాడ నియోజక వర్గాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు ఉంటుంది
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 21
ఎంపీ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ ఖాళీ అవుతుందని 10 సంవత్సరాలలో దేశానికి మోడీ చేసింది ఏమీ లేదని హుజూర్నగర్ కోదాడ నియోజక వర్గాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ రెండు నియోజకవర్గాల ఓటర్లు నా కుటుంబ సభ్యులని వారి కోసం మేము ఎల్లవేళలా నిరంతరం పనిచేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
సూర్యపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణములో రాజీవ్ ప్రాంగణంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నల్గొండ పార్లమెంటు ఎన్నికల ఇన్చార్జి నీటిపారుదల మరియు,పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే నలమాద పద్మావతి రెడ్డి,మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, మాజీమంత్రి కుందూరు జానా రెడ్డి,కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావులు పాల్గొన్నారు.
ఇట్టి కార్యక్రమంలో
మంత్రి ఉత్తమ్ రెడ్డి మాట్లాడుతూ
గత ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ,కార్యకర్తలను బి ఆర్ఎస్ నాయకులు ఇబ్బందులకు గురిచేసిన ధైర్యంగా మన కార్యకర్తలు నిలబడిన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని
భారతదేశం యొక్క దశ,దిశ ను నిర్ణయించే ఎన్నికలు నేడు జరగబోతున్నాయని ఎన్నికలు జరిగిన తర్వాత
బరాస పార్టీ అడ్రస్ లేకుండా పోతుందనీ
104 సీట్ల నుంచి 39 సీట్లు బారసకు ఇప్పుడు వచ్చినాయి
ఎంపీ ఎన్నికల తరువాత బారస పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారని
ప్రతి భూతు నుంచి వచ్చే ఓట్లు ను నేను స్వయంగా పర్యవేసిస్తానని
ఎంపీ ఎన్నికల్లో రఘువీర్ రెడ్డి కి దేశంలోని అత్యదిక మెజారిటీ రావాలని ఆ దిశగా మీరందరూ పనిచేయాలని కోరుతున్నానని
సీపీఐ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు వారికి ఈ వేదిక మీద నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని
మొన్న జరిగిన సమావేశంలో బీజేపీ ప్రభుత్వం 145 మంది ఎంపీ లను సెస్పెండ్ చేశారు.
కేంద్రంలో మరొకసారి బీజేపీ వస్తే భారతదేశం ప్రమాదంలో పడుతుందని
తొలి విడత జరిగిన పోలింగ్ లో స్పష్టమైన మెజారిటీ వస్తుందని
ఇండియా కూటమిలో రాహుల్ జూన్ 9 న ప్రధానిగా ఎన్నిక కాబోతున్నాడని
బారస,బీజేపీ ఎంపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని
రైల్వే,రహదారులపై పార్లమెంట్ లో నావంతుగా కృషి చేసానని
బరాస,బీజేపీ పార్టీ లను తప్ప అన్ని సంఘాలను మద్దతు కోరుతున్నమని అన్నారు.
మాజీ మంత్రి జానారెడ్డి
మాట్లాడుతూ మోదీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టలేదని మోడీ మతతత్వ రాజకీయాలు చేస్తున్నాడని కేసీఆర్ 10 సంవత్సరములు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడని 10 సంవత్సరాలలో ఇల్లు రుణమాఫీ చేయక ప్రజలను పరిచవేతకు గురి చేసాడని ప్రజాసంఘాలను ప్రతిపక్ష నాయకులు అనిసి వేయడానికి కృషి చేశాడని మా పదవులను త్యాగము చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు కృషి చేశామని
నాగార్జునసాగర్ ద్వారా నీళ్లు వచ్చి 60 సంవత్సరాలలో పంటలు పండడానికి కారణం కాంగ్రెస్ పార్టీ పని చేసిందని కేసీఆర్ ఉన్నప్పుడే పంట హాలిడే ప్రకటించిన దానిని గుర్తు చేస్తున్నానని మేము ఇచ్చిన హామీలను త్వరలో నే నెరవేస్తామని పంటకు గిట్టుబాటు ధరను చట్టం ద్వారా అమలు చేస్తామని ఐదు లక్షల రూపాయలతో ఇంట్ల ఇండ్లను నిర్మిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ విడతల వారీగా అమలు చేస్తున్నామని నల్లగొండ జిల్లాకు చాలా చరిత్ర ఉన్నదని నేను చేయాల్సి మిగిలిపోయిన పనులను నా తనయుల ద్వారా నెరవేరుస్తానని ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో నా కుమారున్ని గెలిపించాలని ఈ సభా వేదికగా వేడుకుంటున్నానని అన్నారు.
ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడికో వెళ్లిన కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ ఉందని ఎంపీ అభ్యర్థిగా నేను నిలబడటం అదృష్టంగా భావిస్తున్నానని ఈ 20 రోజులు మన మేనిఫెస్టోను ప్రజలలోకి తీసుకువెళ్లాలని హుజూర్నగర్ నియోజకవర్గమును నుండి లక్ష మెజార్టీ రావడం పెద్ద లెక్క కాదని
అది మిమ్మల్ని చూస్తుంటే అర్థం అవుతుందని 24వ తారీఖున నామినేషన్ వేస్తున్నానని మీరందరూ భారీగా తరలిరావాలని ఎంపీగా గెలిచిన తర్వాత అందుబాటులో ఉండి అభివృద్ధి కోసం పోటీ పడతానని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మిర్యాలగూడ శాసనసభ్యులు బిఎల్ఆర్ పూనం నేని సాంబశివరావు కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్రావు జడ్పిటిసిలు ఎంపీపీలు మార్కెట్ కమిటీ చైర్మన్ లు మున్సిపల్ చైర్మన్లు కౌన్సిలర్లు పి ఎస్ సి ఎస్ చైర్మన్లు సర్పంచులు ఎంపీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు బూత్ కమిటీ ఇన్చార్జిలు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.