సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
తాజాగా తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణరాష్ట్రం సూర్యాపేట జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న ఓ కంటైనర్ లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టింది.
ఈ సంఘటనలో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిం చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రోడ్డుప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్ 04ఎఫ్ఏ 6894గా పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వారు నిద్ర మత్తులో ఉండడమే ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. అలానే ఆగి ఉన్న లారీ సిగ్నల్ వేయకుండా వాహనం నిలపడంతో ఈ ప్రమాదం జరిగిందా అనే కోణం కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అలానే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందాల్సి ఉంది. అయితే ప్రమాదాన్ని చూసినట్లు వేగంగా కారు లారీని ఢీ కొట్టింది. అంతేకాక లారీ భారీ బరువుతో ఉండటంతో కారు..దానికి కిందకు పూర్తిగా దూరిపోయింది.
ఇక రోడ్డుపై సిగ్నల్ వేయకుండా వాహనాలు ఆపొద్దని రవాణాశాఖ అధికారులు వాహదారులను హెచ్చరిస్తున్నారు. అయినా కూడా కొందరు ఆవేమి పట్టించుకోకపోవడంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.