స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం.. లోక నాయకుడు కమల్ హాసన్ ఇంతతీవ్ర విషాదం చోటుచేసుకుంది. కమల్ హాసన్ మామయ్య, పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్ష్యుడు అరుయిర్ శ్రీనివాసన్ కన్నుమూశారు. 92 ఏళ్ల శ్రీనివాసన్ గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న ఆయన తన స్వస్థలం అయిన కొడైకెనాల్ లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ” …

స్టార్ హీరో కమల్ హాసన్ ఇంట తీవ్ర విషాదం..

లోక నాయకుడు కమల్ హాసన్ ఇంతతీవ్ర విషాదం చోటుచేసుకుంది. కమల్ హాసన్ మామయ్య, పీపుల్ జస్టిస్ సెంటర్ అధ్యక్ష్యుడు అరుయిర్ శ్రీనివాసన్ కన్నుమూశారు.

92 ఏళ్ల శ్రీనివాసన్ గత కొంతకాలంగా వయోవృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక నిన్న ఆయన తన స్వస్థలం అయిన కొడైకెనాల్ లో మృతి చెందారు. మామ మరణంపై కమల్ ఎమోషనల్ అయ్యారు. మామ శ్రీనివాసన్ గురించి కమల్ ట్విట్టర్ లో రాసుకొచ్చాడు.

” నా వ్యక్తిత్వాన్ని రూపుమాపడంలో ప్రధాన పాత్ర పోషించిన అంకుల్ అరుయిర్ శ్రీనివాసన్ ఈరోజు కొడైకెనాల్‌లో 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. మామ వాసు తన విప్లవాత్మక ఆలోచనలు మరియు ధైర్య సాహసాల కోసం ఎంతో పోరాడారు.. బంధువులు మరియు స్నేహితుల మధ్య ఆయన వీరోచిత వ్యక్తి.

అంత్యక్రియల నిమిత్తం ఆయన భౌతికకాయాన్ని ఇవాళ రాత్రి ప్రజానీతి కేంద్రం కార్యాలయానికి తీసుకురానున్నారు. రేపు (23-04-24) ఉదయం 10:30 గంటలకు బీసెంట్ నగర్ మిన్ మయన్‌లో దహన సంస్కారాలు జరుగుతాయని నేను మీకు తెలియజేస్తున్నాను” అని కమల్ తెలిపాడు.

ఇంకోపక్క శృతి హాసన్ కూడా అరుయిర్ శ్రీనివాసన్ మృతిపై ఎమోషనల్ అయ్యింది. ” మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను వాసు మామ.. నా చిన్ననాటి జ్ఞాపకాలన్నింటికీ ధన్యవాదాలు, కోడిలోని అడవుల్లో గంటల తరబడి నడవడం, జీవితం గురించి నాకు ప్రకృతి గురించి బోధించడం మరియు మీ అందమైన కథలతో నన్ను తీర్చిదిద్దడం,

నా కోసం మీరు ఒక రకమైన నిజమైన తిరుగుబాటుదారుగా మారారు. స్వచ్ఛమైన బంగారు హృదయం కలిగిన మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తారు వాసు మామా” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Updated On 23 April 2024 2:44 PM IST
cknews1122

cknews1122

Next Story