ఇంటర్ ఫలితాల్లో మెరిసిన వి ఆర్ కళాశాల విద్యార్థులు..
రాష్ట్రస్థాయి ర్యాంకులు కైవసం…..
విద్యార్థులను అభినందించిన కళాశాల ప్రిన్సిపాల్,అధ్యాపకులు
సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 24
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ఆలేరు వెంకట రమణ (వి.ఆర్) జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులను కైవసం చేసుకొన్నారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపిసీ విభాగంలో(1) దాసి మానస 987 /1000, ఎంపీసీ విభాగంలో (2) పోరెడ్డి నిఖిత 980 /1000, సీఈసీ విభాగంలో లో (3) గుండె అశ్విని 886 /1000 మార్కులు సాధించారు.
అలాగే ప్రథమ సంత్సరం ఎంపీసీ లో (1) సారియా తబస్సుమ్ 463 / 470,బైపిసి లో (2) మెలంగి హన్నా హెలెన్ 423/440, సీఈసీ లో (3) పాశికంటి ఉదయ్ మహేష్ 368 /500 మార్కులు సాధించారు. వీరితో పాటు అనేక మంది విద్యార్థులు ఉత్తమమైన మార్కులు సాధించారని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప,వైస్ ప్రిన్సిపాల్ ఉప్పలి రాజు,అధ్యాపకులు పరుషరాములు,మానస, భాస్కర్, మధుసూదన్,వీరాచారీ,కమలాకర్,సునంద,కృష్ణ,ఉప్పాచారి,జ్యోతి, రమేష్,ఇందిర,సింధు తదితరులు విద్యార్థులను అభినందించారు .