గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తుపాకీ మిస్‌ఫైర్ అయి ఓ సీఆర్‌పీఎఫ్ డీఎస్పీ స్పాట్‌లోనే కన్నుమూశాడు. ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా చర్ల పూసుగుప్ప 81వ బెటాలియన్‌లో ఘటన చోటు చేసుకుంది.
డీఎస్పీ శేషగిరిరావు ప్రమాదవశాత్తు కిందపడటంతో ఆయన చేతిలోని గన్ పేలింది. బుల్లెట్ నేరుగా ఛాతీలోకి దూసుకెళ్లటంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. బెటాలియన్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ డీఎస్పీ మృతి చెందారు. అయితే ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలోనూ తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ ఘటనలో ఏఆర్ ఎస్‌ఐ ప్రాణాలు కోల్పోయాడు.
హుస్సేని ఆలం పీఎస్ పరిధిలోని కబూతర్ ఖానా వద్ద పోలీసు పికెట్ వద్ద విధులు నిర్వహిస్తున్న RSI బాలేశ్వర్ తుపాకీ తుటా తగిలి ప్రాణాలు కోల్పోయాడు. గన్ నుంచి బుల్లెట్ తలలోకి దూసుకెళ్లటంతో స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
ఈయనే కాకుండా ఇటీవల కాలంలో మరికొందరు పోలీసులు తుపాకీ మిస్ ఫైర్ అయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలు పోలీసుశాఖలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.