ఖమ్మంలో ఆర్ఆర్ఆర్ జోష్..!
మంత్రులు తుమ్మల, పొంగులేటి,ఎంపీ రేణుకా చౌదరి తో కలిసి నామినేషన్ కు ర్యాలీగా
వందలాదిగా కదిలొచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
మద్దతు తెలిపిన వామపక్షాలు
ఖమ్మం: కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి ( ఆర్ ఆర్ ఆర్ )నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో గురువారం జోష్ నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
పార్లమెంట్ అభ్యర్థిగా ఖరారు అయ్యాక తొలిసారిగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి తో కలిసి ఖమ్మం రాగా ఖమ్మం కాంగ్రెస్ శ్రేణుల నుంచి రఘురాం రెడ్డికి కోలాట నృత్యాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘన స్వాగతం లభించింది.
కాల్వొడ్డు నుంచి కలెక్టరేట్ కు ఆటో, బైకులతో ప్రదర్శన..
నగరంలోని కాల్వొడ్డు నయాబజార్ కళాశాల నుంచి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రఘు రాం రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, కాంగ్రెస్ శాసన సభ్యులు, కొత్తగూడెం సీ పీ ఐ ఎమ్మెల్యే సాంబశివరావు ,
సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువాళ్ళ దుర్గ ప్రసాద్ తో కలిసి తో కలిసి కొత్త కలెక్టరేట్ వరకు ర్యాలీ గా వచ్చారు.
ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లలో వందలాదిగా తరలి వచ్చారు. అనంతరం కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ కు నామినేషన్ పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ , జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు , కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావేద్ , మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్ళూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.