ఎంపీ అభ్యర్థి గా వేసిన నామినేషన్ విత్ డ్రా చేసుకున్న రాయల నాగేశ్వరరావు….
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాను సారం తన నామినేషన్ ను రాయల నాగేశ్వరరావు విత్ డ్రా చేసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నాయకులకు,కార్యకర్తలకు,
అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కార్యకర్తలకు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీగారిని ప్రధానిని చేయడం తమ లక్ష్యం అన్నారు.మతతత్వ పార్టీ అయిన బీజేపీ ని ఓడించాలని ఆయన తెలిపారు.కాంగ్రెస్ అధిష్టానం ఖమ్మం అభ్యర్ధిగా ప్రకటించిన రామసహయం రఘురామ్ రెడ్డి గారి విజయానికి కృషి చేయాలని రాయల పిలుపు ఇచ్చారు.కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఐక్యం గా పనిచేసి కాంగ్రెస్ అభ్యర్ధి ని ఎంపీ గా గెలిపించి రాహుల్ గాంధీకి బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు.