మహిళపై అత్యాచారం చేయబోయిన కానిస్టేబుల్…
భర్త లేని సమయంలో ఇంటికీ రావడంతో సిన్ రివర్స్…
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అడ్డదారులు తొక్కుతున్నారు. మహిళలకు భరోసా కల్పించాల్సిన పోలీసులు కీచకులుగా మారుతున్నారు.తాజాగా, మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్‌కు దేహశుద్ధి చేసిన ఘటన ఆదిలాబాద్ ధోబీ కాలనీలో చోటు చేసుకుంది.
ఉదయం భర్త లేని సమయంలో మహిళ ఇంటికి కానిస్టేబుల్ వెళ్లాడు. మహిళ కేకలు వేయడంతో కానిస్టేబుల్ గణేష్‌ను స్థానికులు పట్టుకున్నారు. అనంతరం ఏఆర్ కానిస్టేబుల్ గణేష్‌ను కాలనీ వాసులు చితకబాదారు.
అనంతరం మావల పోలీసు స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. యాపల్ గూడ బెటాలియన్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా గణేష్ పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.