రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం
- అప్పుడే కేంద్రంలో సుపరిపాలన సాధ్యం
- ఖమ్మం ఎంపీ గా రఘురాం రెడ్డిని భారీ మెజారిటీ తో గెలిపిద్దాం
- కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గ సమావేశంలో మంత్రి పొంగులేటి
సికె న్యూస్ ప్రతినిధి
సత్తుపల్లి: ఈ సారి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని గె లిపించుకుందాం అని, అందుకోసం అంతా హస్తం గుర్తుపై ఓటేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొoగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.
ఆదివారం సత్తుపల్లి లోని మాధురి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన కాంగ్రెస్ సత్తుపల్లి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయo రఘురాం రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
బీ జే పీ పాలనలో దేశ పరువు, ప్రతిష్టలను విదేశాలకు తాకట్టు పెట్టారని విమర్శించారు. ఎనిమిది వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్ర విభజన హామీలను ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు.
మన మేనిఫెస్టో పై బీ జే పీ దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ నాడూ ప్రజలను, ఎమ్మెల్యే లను, కనీసం మంత్రులను కూడా పట్టించుకో లేదని తెలిపారు. ధనిక రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చారనీ.. ఇకపై ఆయన్ను జనం నమ్మ బోరని అన్నారు.
అర్హులందరికీ పథకాలు..
ఆగస్టు 15 లోపు రైతుల రుణమాఫీ జరుగుతుందని, పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, రేషన్ కార్డులు, పింఛన్లు ఇతర హామీలన్నీ ప్రభుత్వం చిత్తశుద్ధి తో అమలు చేస్తుoదని మంత్రి పొంగులేటి అన్నారు.
రఘురాం రెడ్డిది సేవా కుటుంబం..
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కి రామ సహాయం రఘురాం రెడ్డి కుటుంబం సేవ చేస్తోందని అన్నారు. నా సొంతూరు నారాయణపురం సత్తుపల్లి పరిధిలోనే ఉందని, ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పవాళ్ళ దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మువ్వా విజయ బాబు, మద్దినేని స్వర్ణ కుమారి, సీపీఐ, సీపీఎం శ్రేణులు, కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.