నేడు ఖమ్మంకి మాజీ సీఎం కేసీఆర్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ఆపార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర సోమవారం సాయంత్రం ఖమ్మం చేరుకోనుంది.
వరంగల్ నుంచి తిరుమలాయపాలెం మీదుగా ఖమ్మం చేరుకుని, కాల్వొడ్డు నుంచి మయూరిసెంటర్, వైరా రోడ్డు మీదుగా జెడ్పీ సెంటర్ వరకు యాత్ర కొనసాగుతుంది.
జెడ్పీ సెంటర్లో కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతారు. అనంతరం ఖమ్మంలోని మాజీ మంత్రి పువ్వాడ నివాసంలో కేసీఆర్ బస చేయనున్నారు.