సీఎం రేవంత్ రెడ్డి కి షాక్… దిల్లీ పోలీసులు నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకు అమిత్ షా నోటీసులు పంపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు అమిత్ షా తనకు, గాంధీభవన్‌కు నోటీసులు పంపారని విమర్శించారు. కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో …

సీఎం రేవంత్ రెడ్డి కి షాక్…

దిల్లీ పోలీసులు నోటీసులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న నేతలకు అమిత్ షా నోటీసులు పంపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు అమిత్ షా తనకు, గాంధీభవన్‌కు నోటీసులు పంపారని విమర్శించారు.

కర్ణాటకలోని సేడం ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎంతో పోరాటం చేస్తున్నారన్నారు. ఈ పోరాటంలో కర్ణాటక నుంచి 25 ఎంపీలను గెలిపించి మోదీని గద్దె దించడానికి సహకరించాలని కోరారు.

కర్ణాటక రాష్ట్రానికి కరువు వస్తే మోదీ ఎలాంటి సహాయం చేయలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ కర్ణాటకకు ఇచ్చిందేం లేదు… ఖాళీ చెంబు తప్ప అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటోందన్నారు.

రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడి స్థాయికి ఎదిగారన్నారు. మల్లికార్జున ఖర్గేకు మీరు మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఉందన్నారు.

బీజేపీని ప్రశ్నిస్తే నోటీసులు "గుజరాత్ మోదీకి అండగా ఉన్నట్లే.. కర్ణాటక ఖర్గేకు అండగా నిలవాలి. కర్ణాటక నుంచి 25 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలి. ఈ ఎన్నికలు కర్ణాటక వర్సెస్ గుజరాత్.

బీజేపీపై పోరాటం చేసే వారికి అమిత్ షా నోటీసులు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బీజేపీని ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రినైన నాకు, గాంధీ భవన్ నేతలకు దిల్లీ పోలీసులు నోటీసులు ఇస్తున్నారు.

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపిస్తున్నారు. మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం" -సీఎం రేవంత్ రెడ్డి

ఇది తెలంగాణ ప్రజలపై దాడి. దిల్లీ పోలీసులను పిలిపించి బెదిరించి సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చేలా అధికార దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ అన్నారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బెదిరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లను ఆపాలని ఆర్‌ఎస్‌ఎస్‌ కోరుతోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు తెలంగాణ ప్రజలపై దాడిగా అభివర్ణించారు.

సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు

సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎం రేవంత్ రెడ్డితో సహా పలువురు కాంగ్రెస్ నేతలకు(Congress) పోలీసులు సమన్లు జారీ చేశారు. మే 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఈ వీడియోను షేర్ చేసిన పలువురు కాంగ్రెస్ నేతలకు దిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ విషయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు.

Updated On 29 April 2024 7:22 PM IST
cknews1122

cknews1122

Next Story