గంట వ్యవధిలో 7 ఇంజెక్షన్స్ ఇచ్చిన RMP జ్వరంతో వచ్చిన యువకుడికి ఓ ఆర్‌ఎంపీ గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజుల పాటు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ చేసినా ప్రాణాలు దక్కలేదు.ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో సోమవారం వెలుగుచూసింది. వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్‌ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 26న జ్వరంతో పాటు, నీరసంగా ఉండడంతో పట్టణంలోని ఫిరంగిగడ్డకు …

గంట వ్యవధిలో 7 ఇంజెక్షన్స్ ఇచ్చిన RMP

జ్వరంతో వచ్చిన యువకుడికి ఓ ఆర్‌ఎంపీ గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో అతడి పరిస్థితి విషమంగా మారింది. రెండు రోజుల పాటు ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్‌ చేసినా ప్రాణాలు దక్కలేదు.
ఈ ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో సోమవారం వెలుగుచూసింది.

వర్ధన్నపేట పట్టణానికి చెందిన కత్తి నవీన్‌ (28) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 26న జ్వరంతో పాటు, నీరసంగా ఉండడంతో పట్టణంలోని ఫిరంగిగడ్డకు చెందిన ఆర్‌ఎంపీ ఆడెపు శ్రీనివాస్‌ వద్దకు వెళ్లాడు.

అతడు నవీన్‌ను పరీక్షించి కుడి, ఎడమ తొంటికి రెండు ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు సెలైన్‌ బాటిల్‌ పెట్టి అందులో మరో నాలుగు ఇంజక్షన్లు కలిపాడు. దీంతో నవీన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆర్‌ఎంపీ వెంటనే మరో ఇంజక్షన్‌ ఇచ్చాడు.

ఇలా గంట వ్యవధిలోనే ఏడు ఇంజక్షన్లు ఇవ్వడంతో నవీన్‌ పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు ఆర్‌ఎంపీని నిలదీయడంతో ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు.

స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లగా నవీన్‌ కండిషన్‌ సీరియస్‌గా ఉందని చెప్పడంతో వరంగల్‌లోని ఓ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ ఒక రోజు ట్రీట్‌మెంట్‌ చేసిననప్పటికీ నవీన్‌ పరిస్థితి మెరుగుపడకపోగా, మరింత విషమించింది. దీంతో ఈ నెల 28న హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.

నవీన్‌ చనిపోవడంతో ఆర్‌ఎంపీ శ్రీనివాస్‌ వర్ధన్నపేట నుంచి పరార్‌ అయ్యారు. ఆర్‌ఎంపీ నిర్లక్ష్యం, ఇష్టారాజ్యంగా ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే తన భర్త ప్రాణాలు కోల్పోయాడంటూ నవీన్‌ భార్య మేఘన సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Updated On 30 April 2024 5:03 PM IST
cknews1122

cknews1122

Next Story