మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ… సంబురాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం …

మద్యం ప్రియుల గోడు తీర్చిన ఎక్సైజ్ శాఖ…

సంబురాలు చేసుకున్న తాగుబోతుల సంఘం సభ్యులు

మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తరుణ్ చేసిన పోరాటం ఫలించింది. కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..మండు టెండల్లో మద్య ప్రియుల బాదలు తీర్చాలంటూ మంచిర్యాల ఐబీ నుండి మంచిర్యాల కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి ఎక్సైజ్ శాఖకు తన గోడు వెళ్లబోసుకున్నాడు

మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు.. దీంతో అతని పోరాటం 24 గంటల్లోనే ఫలించింది. మంచిర్యాల జిల్లావ్యాప్తంగా ఉన్న వైన్ షాప్లు, బార్లలో కింగ్ ఫిషర్ బీర్ల స్టాక్ అధికారులు అందుబాటులోకి తెచ్చారు.

దీంతో పలువురు తాగుబోతులు సంబరాలు చేసుకున్నారు. తమ తరుపున పోరాటం చేసి తమ బీర్ల దాహం తీర్చిన తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు తాగుబోతులు.

మంచిర్యాల జిల్లాతో పాటు కరీంనగర్ , జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు దొరకడం లేదని, దీంతో తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని తరుణ్ సోమవారం మంచిర్యాల జిల్లా ఎక్సెజ్ సూపరింటెండెంట్ కు వినతిపత్రం సమర్పించారు.

ఈ వార్త అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో వ్యాపించి క్షణాల్లో రాష్ట్ర స్థాయి ఎక్సైజ్ శాఖకు చేరింది.ఈ రకమైన వినూత్న నిరసన తొలి సారి కావడంతో సర్వత్రా చర్చకు దారి తీసింది.

దీంతో వెంటనే స్పందించిన అధికారులు లైట్ బీర్ల కొరతకు వెంటనే చెక్ పెట్టారు. 24 గంటల్లోనే తమ కష్టాలు తీర్చిన అదికారులకు అభినందనలు తెలిపాడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తరుణ్..

Updated On 1 May 2024 1:42 PM IST
cknews1122

cknews1122

Next Story