చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్ర గాయలయ్యాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఎన్నికల సమావేశం అనంతరం భోజనాలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి భోజనాలు చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో చికెన్‌ కర్రీ వేసుకునేందుకు వెళ్లిన …

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు గాయాలు

చికెన్‌ కర్రీలో పడి బీఆర్‌ఎస్‌ కార్యకర్తకు తీవ్ర గాయలయ్యాయి. బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఎన్నికల సమావేశం అనంతరం భోజనాలు చేసే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాలిలా ఉన్నాయి. ధారూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం సమావేశానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి భోజనాలు చేసేందుకు వెళ్లారు.

ఈ క్రమంలో చికెన్‌ కర్రీ వేసుకునేందుకు వెళ్లిన మండల పరిధిలోని కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ కార్యకర్త గొర్రెంకల మల్లయ్య కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్‌ బోగాణలో పడిపోయాడు.

ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలయ్యాయి. ఇది గమనించిన కార్యకర్తలు ఆయనను వెంటనే వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Updated On 3 May 2024 11:05 AM IST
cknews1122

cknews1122

Next Story