పదవ తరగతి ఫలితాలు ఆందోళన కల్గిస్తున్నాయి కొడారి వెంకటేష్.బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు సి కే న్యూస్ (సంపత్) మే 03 తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా,25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి …

పదవ తరగతి ఫలితాలు ఆందోళన కల్గిస్తున్నాయి

కొడారి వెంకటేష్.
బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు

సి కే న్యూస్ (సంపత్) మే 03

తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో యాదాద్రి భువనగిరి జిల్లా,25 వ స్థానానికి పరిమితం కావడం చాలా ఆందోళన కలిగించే అంశమని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా వెలువడిన పదవ తరగతి ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా లోని సూర్యాపేట 06 వ స్థానంలో, నల్లగొండ 09 వ స్థానంలో ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా 25 వ స్థానంలో ఉండడం తల్లిదండ్రులను,బాలల హక్కుల సంఘం నాయకులను బాధించే అంశమని ఆయన అన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా లో మొత్తం 9,108 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాయగా 8,237 మంది విజయం సాధించారని, 871మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారని ఆయన అన్నారు. కేవలం 39 ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే వంద శాతం ఉత్తీర్ణత రావడం చాలా విచారకరమని ఆయన అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుటకు, మార్కుల శాతం ను పెంచుటలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారని ఆయన అన్నారు.తుర్కపల్లి మండలం గందమల్ల ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలు రాయగా కేవలం ఇద్దరు మాత్రమే ఉత్తీర్ణత సాధించడం చాలా బాధాకరమైన విషయమని ఆయన అన్నారు.

ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యను అందించాలని ప్రభుత్వం గత సంవత్సరం జులై నెలలో పోచంపల్లి మండలం లోని పోచంపల్లి,జూలూరు, ఇంద్రియాల, వంక మామిడి హైస్కూల్లల్లో సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు చేసి 8,9,10 తరగతుల విద్యార్థులకు 75 ఇంచుల ఎల్ ఈ డి స్క్రీన్ పై డిజిటల్ విద్యను అందించారు.ఐనా ఆ మండలంలో మొత్తం 41 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాదించక పోవడం విద్యాశాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు.

పేద,మద్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాద్యాయులు,విద్యాశాఖ అధికారులు విద్యను సక్రమంగా అందించని కారణంగానే యాదాద్రి భువనగిరి జిల్లా,రాష్ట్ర స్థాయిలో విద్యలో వెనుకబడి పోయిందని, భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు రాకుండా చర్యలు తీసుకోవాలని,జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు రావడానికి కృషి చేయాలని ఆయన కోరారు.

Updated On 3 May 2024 9:24 AM IST
cknews1122

cknews1122

Next Story