ఈ నెల 7 తేది న హజ్రత్ సయ్యద్ ఉజాలే షా ఖాద్రీ వార్షిక ఉర్స్ షరీఫ్…
ఈ నెల 7 తేది న హజ్రత్ సయ్యద్ ఉజాలే షా ఖాద్రీ వార్షిక ఉర్స్ షరీఫ్… సి కే న్యూస్ (సంపత్) మే 05 యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్ పేట్ లో హజ్రత్ సయ్యద్ అక్రముల్లా షా ఖాద్రీ అలియాస్ హజ్రత్ సయ్యద్ ఉజాలే షా ఖాద్రీ వార్షిక ఉర్స్ షరీఫ్ మే 7 మంగళా వారం నాడు జరగనుందని దర్గా ముతవల్లి మౌలానా హఫీజ్ మస్తాన్ అలీ యాకుబీ నిజామీ …

ఈ నెల 7 తేది న హజ్రత్ సయ్యద్ ఉజాలే షా ఖాద్రీ వార్షిక ఉర్స్ షరీఫ్…
సి కే న్యూస్ (సంపత్) మే 05
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని మహబూబ్ పేట్ లో హజ్రత్ సయ్యద్ అక్రముల్లా షా ఖాద్రీ అలియాస్ హజ్రత్ సయ్యద్ ఉజాలే షా ఖాద్రీ వార్షిక ఉర్స్ షరీఫ్ మే 7 మంగళా వారం నాడు జరగనుందని దర్గా ముతవల్లి మౌలానా హఫీజ్ మస్తాన్ అలీ యాకుబీ నిజామీ తెలియజేశారు.
ఉదయం 5 గంటలకు గుసల్ బర్గా షరీఫ్, ఫాజర్ నమాజు అనంతరం ఖురాన్ పఠిస్తారు.అదే విధంగా అసర్ నమాజు అనంతరం ఖాసిదా బర్దా షరీఫ్ అబ్దుల్ లతీఫ్ నిజామి పఠిస్తారు.
సాయంత్రం మఫ్రిబ్ నమాజ్ తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది.ఈ సభా కార్యక్రమంలో మౌలానా హామీద్ అహ్మద్ ఖురేషీ ప్రసంగిస్తారు. సభ కార్యక్రమం తరువాత.గంధం నిర్వహిస్తారు.గంధం అనంతరం జేకే షాహీన్ ఖవ్వాలీ కలాంను ప్రదర్శిస్తారు.ఈ ఉర్స్ ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరరు..
