ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది..
ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోండు బోందయ్య .
మాదిగలు కాంగ్రెస్ వైపే ఉన్నారు..
తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టండి..
మాదిగల ఓట్ల కోసమే బీజేపీ వర్గీకరణకు మద్దతు..
తెలంగాణలోని మాదిగలు అందరూ కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు అన్నారు ఖమ్మం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బొండు బోందయ్య. బుధవారం కూసుమంచి మండల కేంద్రంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎస్సీ సెల్ నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఎస్సీ వర్గీకరణ అంశం కోర్టు పరిధిలో ఉంది ..
ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పలు సందర్భంలో స్పష్టం చేసిన విషయం గుర్తు చేశారు .. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన దళిత డిక్లరేషన్ లో కూడా వర్గీకరణ అంశం ఉందని తెలిపారు.. ఎస్సీ వర్గీకరణ విషయంలో మంద కృష్ణమాదిగ నిర్ణయాన్ని గౌరవిస్తామని కానీ మాదిగ జాతి మొత్తం బీజేపీ వైపే ఉందని మంద కృష్ణమాదిగ చేస్తున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ లో పూర్తి మెజారిటీ ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ విషయంలో కాలయాపన చేస్తూ మాదిగలను మభ్యపెడుతుందని అన్నారు. నిజంగా ఎస్సీ వర్గీకరణపై బీజేపీకి చిత్త శుద్ధి ఉంటే ఆర్టికల్ 370 రద్దు చేసినట్లు ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
పూర్తి మెజారిటీ ఉండి గతంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కలిపిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ పది సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మాదిగలను మోసం చేసింది అన్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్సీ వర్గీకరణ అంశం ఓట్ల కోసమే ముందుకు తెచ్చింది అని దుయ్యబట్టారు..
ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తరతరాల నుండి కాంగ్రెస్ పార్టీ వైపే దళితులు ఉన్నారు. దళితుల్లో రాజకీయంగా ఎదిగిన నాయకులు ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కనపడతారు.. ఇతర పార్టీల్లో కనీసం దళిత నాయకత్వమే కనపడదని తెలిపారు.
మే 13 పార్లమెంట్ ఎన్నికలో కూడా తెలంగాణ మాదిగ సమాజం మొత్తం కాంగ్రెస్ వైపే ఉంటుందని . అలాగే ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామసహాయం రఘురాం రెడ్డి వెనకే పాలేరు నియోజకవర్గ మాదిగ ప్రజానీకం నిలుస్తుందని ..
ఈ ఎన్నికలో పాలేరు నియోజకవర్గం నుండి అత్యధిక ఓట్ల మెజారిటీని ఇచ్చి ఎంపీగా రఘురాం రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ నాయకులు ఎంపీటీసీ మదాసు ఉపేందర్ రావు , కొరివి వెంకటరత్నం , యడవల్లి ముత్తయ్య , కొండ శ్రీనివాస్ , చాట్ల సత్యనారాయణ ,కనకం మైసయ్య తదితరులు ఉన్నారు.