బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకుని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బేగంపేట నాళాలో కొట్టుకు వచ్చిన ఇద్దరు ఎవరు …

బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు

నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి.

ఈ విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకుని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బేగంపేట నాళాలో కొట్టుకు వచ్చిన ఇద్దరు ఎవరు అనేది తెలియాల్సి ఉంది. వారి ఫొటోల ఆధారంగా వివరాల సేకరణలో ఉన్నారు పోలీసులు. మంగళవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు హైదరాబాద్ సిటీలో పడిన కుండపోత వర్షానికి.. ఎవరైనా నాళాలో పడి చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది.

సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో ఏమైనా మిస్సింగ్ కంప్లయింట్స్ ఉన్నాయా అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. బేగంపేట నాళాలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాల వార్త సంచలనంగా మారింది.

Updated On 8 May 2024 6:58 PM IST
cknews1122

cknews1122

Next Story