హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..
హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై.. హైదరాబాద్ లో ఓ యువతి ఉద్యోగం కోసం వెళ్లి అత్యాచార యత్నానికి గురైంది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్లగా..ఆ మేనేజర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మధురా నగర్లో టెక్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి అప్లై చేసుకుంది. ఆ తర్వాత ఆ యువతికి కాల్ …
![హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై.. హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..](https://cknewstv.in/wp-content/uploads/2024/05/n60744495217154068987112d9ee39f582e4b06bfde267469a7ea351c7e547d2fb8aa4f76c2c4252a4261dd.jpg)
హైదరాబాద్‌లో దారుణం.. ఇంటర్వ్యూకి వచ్చిన యువతిపై..
హైదరాబాద్ లో ఓ యువతి ఉద్యోగం కోసం వెళ్లి అత్యాచార యత్నానికి గురైంది. ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా యువతి ఇంటర్వ్యూ కోసం వెళ్లగా..
ఆ మేనేజర్ అఘాయిత్యానికి ప్రయత్నించాడు.
ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని మధురా నగర్లో టెక్ ఫ్లో అనే సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం కోసం ఓ యువతి అప్లై చేసుకుంది.
ఆ తర్వాత ఆ యువతికి కాల్ చేసి కంపెనీ యాజమాన్యం ఇంటర్వ్యూకి పిలిచింది. దీంతో ఆ యువతి మధురా నగర్ లోని ఆ కంపెనీకి ఇంటర్వ్యూ కోసం హాజరైంది.
అనంతరం మేనేజర్ నవీన్ కుమార్ ఆమెను ఇంటర్వ్యూ తీసుకున్నాడు. మీరు ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యారని.. కంపెనీ తరపున ఆఫీస్ సిమ్ కార్డ్ ఇస్తామని చెప్పాడు. తన వద్ద ప్రస్తుతం సిమ్ కార్డు లేదని.. రేపు ఇంటికి రావాలని మేనేజర్ చెప్పాడు. ఇలా మేనేజర్ ఇంటికి యువతి వెళ్లింది.
ఆమె లోపలికి వెళ్లగానే తలుపు వేసి.. యువతిపై మేనేజర్ అత్యాచారానికి ప్రయత్నించినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. యువతి కేకలు వేయడంతో చంపుతానని బెదిరించాడని.. అక్కడి నుంచి తాను తప్పించుకున్నానని యువతి తెలిపింది.
అలా మధురా నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి.. మేనేజర్ నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)