ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన వ్యక్తి.. ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికలను వైసీపీ నాయకులు హింసాత్మకంగా మారుస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వైసీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు. తాజాగా అధికారదర్పం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థిని ఓటరు చెంప పగలకొట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలో వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఆగ్రహానికి లోనైన వైసీపీ అభ్యర్థి …

ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన వ్యక్తి..

ప్రశాంతంగా సాగాల్సిన ఎన్నికలను వైసీపీ నాయకులు హింసాత్మకంగా మారుస్తున్నారు. హుందాగా వ్యవహరించాల్సిన వైసీపీ నాయకులు గూండాల్లా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా అధికారదర్పం ప్రదర్శించిన వైసీపీ అభ్యర్థిని ఓటరు చెంప పగలకొట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తెనాలిలో వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ పోలింగ్ కేంద్రం దగ్గర ఓటు వేసేందుకు క్యూలైన్‌లో కాకుండా నేరుగా వెళ్లడంపై ఓటరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో ఆగ్రహానికి లోనైన వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ ఓటరుపై దాడిచేసారు.

ఈ క్రమంలో బాద్యతాయుతంగా వ్యవహరించాల్సిన అభ్యర్థి బాద్యతారాహిత్యంగా ప్రవర్తించడమే కాకుండా, ప్రశ్నించిన తనపై దాడికి పాల్పడడంతో అసహనానికి గురైన ఓటరు వైసీపీ అభ్యర్థి శివకుమార్‌ చెంప చెల్లుమనిపించారు.

దీనితో ఓటరుపై శివకుమార్‌ అనుచరులు విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Updated On 13 May 2024 12:06 PM IST
cknews1122

cknews1122

Next Story