సరిగ్గా పోలింగ్ "నాడే. ! ఎన్నికలు బహిష్కరించి ధర్నాకు దిగిన తండావాసులు! మా సమస్యలు తీర్చేదాక ఓటు వెయ్యం.! ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం..! ధర్నా దెబ్బతో దిగివచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన అధికారులు.! శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మే 13 ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చుతాయనేది ఎంత నిజమో అదే ఎన్నికల సమయంలో పోరాటం చేస్తే మా సమస్యలు తీరుతాయనే నమ్మకంతో తండావాసులు ఆందోళనకు …

సరిగ్గా పోలింగ్ "నాడే. !

ఎన్నికలు బహిష్కరించి ధర్నాకు దిగిన తండావాసులు!

మా సమస్యలు తీర్చేదాక ఓటు వెయ్యం.!

ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం శూన్యం..!

ధర్నా దెబ్బతో దిగివచ్చి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన అధికారులు.!

శేఖర్ గౌడ్ రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం : మే 13

ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చుతాయనేది ఎంత నిజమో అదే ఎన్నికల సమయంలో పోరాటం చేస్తే మా సమస్యలు తీరుతాయనే నమ్మకంతో తండావాసులు ఆందోళనకు దిగారు ఏళ్ల తరబడి తమ సమస్యల పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న పరిష్కారం కాకపోవడంతో సరిగ్గా పోలింగ్ రోజే ధర్నాకు దిగారు..

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని కొత్తూరు మండలం కొడిచర్ల తండావాసులు ఓటు వేయ్యడానికి నిరాకరిస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు తమ తండాకు ప్రత్యేక పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని రేషన్ సరుకులు తమ తండలోనే ఇవ్వలని తమకు బస్సు సౌకర్యం లేదని వృద్ధులు వికలాంగులు పెన్షన్ తీసుకోవడానికి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని రోడ్డు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని

ప్రతి ఎన్నికల సమయంలో ప్రతిసారి ఓటు వేయడానికి నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుందని రోడ్డుపై ధర్నాకు దిగారు ఆందోళనకు దిగిన వారి దగ్గరికి వెళ్లిన అధికారులు వారు పెట్టిన డిమాండ్లను ఒప్పుకొని త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని నిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా విరమించి ఓటింగ్ లో పాల్గొన్నారు.

Updated On 13 May 2024 2:10 PM IST
cknews1122

cknews1122

Next Story