రైల్వే స్టేషన్‌లో సామాన్య వ్యక్తిలా బెంచ్ పై పడుకున్న మాజీ ఎమ్మెల్యే! మాజీ ఎమ్మెల్యే రైల్వే స్టేషన్‌లో బెంచ్ పై పడుకున్న పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకుడు గోనే ప్రకాశ్ రావు భీమవరం రైల్వే స్టేషన్ లో సామన్య వ్యక్తిలా బెంచ్ పడుకున్నాడు. హైదరాబాద్ వెళ్లెందుకు భీమవరం రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రకాశ్ రావు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం అని తెలుసుకున్నారు. …

రైల్వే స్టేషన్‌లో సామాన్య వ్యక్తిలా బెంచ్ పై పడుకున్న మాజీ ఎమ్మెల్యే!

మాజీ ఎమ్మెల్యే రైల్వే స్టేషన్‌లో బెంచ్ పై పడుకున్న పోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే, రాజకీయ విశ్లేషకుడు గోనే ప్రకాశ్ రావు భీమవరం రైల్వే స్టేషన్ లో సామన్య వ్యక్తిలా బెంచ్ పడుకున్నాడు.

హైదరాబాద్ వెళ్లెందుకు భీమవరం రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రకాశ్ రావు కాకినాడ నుండి హైదరాబాద్ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం అని తెలుసుకున్నారు. దీంతో అక్కడే రైల్వేస్టేషన్ లో ఓ బెంచీ చూసుకొని తన లగేజీని పక్కనే పెట్టుకొని పడుకున్నాడు. ఇది చూసిన వ్యక్తి ఫోటోలు తీసి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. లోక్ సభ ఎన్నికల వేళ రాజకీయ విశ్లేషకుడైన గోనే ప్రకాశ్ రావు ఏపీలో కనిపించడం ఆసక్తిగా ఉంది.

తను చివరగా వీడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేసేందుకు వెళ్లారా? లేక ఎన్నికల సర్వే కోసం వెళ్లారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కాగా పెద్దపల్లి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన గోనే ప్రకాశ్ రావు అనంతరం తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడు.

వైఎస్ఆర్ హయాంలో ఆర్టీసీ చైర్మన్ కూడా బాధ్యతలు నిర్వర్తించాడు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి కొన్నాళ్లు జగన్ వెంట నడిచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ రాజకీయ విశ్లేషకుడిగా ఉన్నారు.

Updated On 13 May 2024 12:18 PM IST
cknews1122

cknews1122

Next Story