ఓటర్ ను అందుకే కొట్టా… కారణం చెప్పిన ఎమ్మెల్యే అభ్యర్థి… ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.స్థానికంగా ఓటేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్ కు వచ్చిన ఓ ఓటర్ పై చేయి చేసుకోవడం, అతను తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ ఈ …

ఓటర్ ను అందుకే కొట్టా… కారణం చెప్పిన ఎమ్మెల్యే అభ్యర్థి…

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న వేళ ఇవాళ గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ పోలింగ్ బూత్ లో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
స్థానికంగా ఓటేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్ పోలింగ్ బూత్ కు వచ్చిన ఓ ఓటర్ పై చేయి చేసుకోవడం, అతను తిరిగి ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ ఈ ఘటనపై స్పందించారు.

తెనాలిలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివకుమార్..ఇవాళ ఓటు వేసేందుకు స్దానికంగా ఉన్న పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. అక్కడ క్యూలైన్ ఉన్నా పట్టించుకోకుండా నేరుగా ఓటు వేసేందుకు వెళ్లబోయారు.

దీంతో అప్పటికే క్యూలైన్లో ఉన్న ఓ సాధారణ ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన్ను చెంపపై కొట్టారు. తిరిగి ఆయన కూడా కొట్టడంతో ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయి ఆయనపై దాడికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ ఘటనపై ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్ధి శివకుమార్ స్పందించారు. ఓటరును కొట్టేందుకు దారి తీసిన కారణాలను వెల్లడించారు. తెనాలి ఐతానగర్‌లో భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లానని,

అక్కడ ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి తనను దూషించినట్లు అన్నాబత్తుని శివకుమార్‌ ఆరోపించారు. వైయస్సార్‌పార్టీపై చాలా ధ్వేషంతో రగిలిపోయాడన్నారు.

చాలా శాడిజంగా దుర్భాషలాడాడని, భార్య ముందే తనను అసభ్యంగా ధూషించాడని అన్నాబత్తుని శివకుమార్‌ తెలిపారు.బూత్‌లోకి వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడన్నారు.

గొట్టిముక్కల సుధాకర్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టిడిపి వ్యక్తి అన్నారు. నువ్వు అసలు కమ్మోడివేనా అంటూ అసభ్యంగా మాట్లాడాడన్నారు. పోలింగ్ బూత్ వద్ద మద్యం మత్తులో అందరి ముందు చాలా దురుసుగా ప్రవర్తించాడన్నారు.

పోలింగ్ బూత్‌లో ఉదయం నుండి అతడు హల్‌చల్ చేస్తున్నట్లు అక్కడి ఓటర్లే చెప్పారన్నారు. అతడు బెంగుళూరులో ఉంటూ ఇక్కడకు వచ్చి హడావిడి చేశాడన్నారు.

టిడిపి-జనసేన వాళ్లు ఎక్కడెక్కడి నుండో వాళ్ల మనుషులను పిలిపించి వైసీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని అన్నాబత్తుని శివకుమార్‌ ఆరోపించారు.

Updated On 14 May 2024 11:53 AM IST
cknews1122

cknews1122

Next Story