అంగన్వాడీ టీచర్ మర్డర్ 72 గంటల్లోనే చేదించిన పోలీసులు
ములుగు జిల్లా :-
ములుగు జిల్లా తాడ్వాయి మండల లోని కాటాపూర్ గ్రామం అంగన్వాడీ టీచర్ ఈనెల 14 న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ములుగు డి.ఎస్.పి ఎన్ రవీందర్ ఈ కేసు వివరాలను శుక్రవారం వెల్లడించారు.
ఈ సందర్భంగా ములుగు డిఎస్పి రవీందర్, పస్రా సీఐ శంకర్, ఎస్సై శ్రీకాంత్ రెడ్డి లు మాట్లాడుతూ.. మృతు రాలి కొడుకు రణం చరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పస్రా సిఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పడి సీసీ పుటేజ్ ఆధారంగా వారి కాల్ డేటా ఆధారంగా పూర్తి ఆధారాలు సేకరించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.
చిన్న బోయినపల్లి గ్రామానికి చెందిన రడం సుజాత ఈనెల 14వ తారీఖున అంగన్వాడిలో విధులు నిర్వహించుకుని తిరిగి వారి స్వగ్రామమైన చిన్నబోయి నపల్లికి బయలుదేరింది.
ఆర్టీసీ బస్సు మిస్ కావడం తో అంతకుముందే పరిచ యం ఉన్న ఆకుదారి రామయ్య బైకుపై నాంపల్లి గ్రామ శివారులోని నీళ్ల గొర్రె వద్ద దించడం జరిగింది. అంతకుముందే అక్కడే ఉన్నా పగిడి జంపయ్య నీలవరి వద్దకు మృతురా లని తీసుకెళ్లి అక్కడ ఆకుదారి రామయ్య, పగిడి జంపయ్య ఇద్దరూ ఆమెను అడవిలో కొద్దిదూరం తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆమె మెడలోని బంగారు గొలుసు తాడును లాక్కునే ప్రయత్నం చేశారు.
ఆమె ప్రతిఘడించడంతో పగిడి జంపయ్య ఆమె తలపై రాయితో కొట్టి, ఆమె స్కార్ఫ్ తో మెడకు చుట్టి హత్య చేసి, మృతురాలి మెడలో నుంచి మూడు తులాల బంగారం గొలుసు తీసుకొని హ్యాండ్ బాగ్ ను మొబైల్ ఫోన్ను అడవిలో దూరంగా పడేసి తిరిగి వారి రొయ్యూరు గ్రామానికి వెళ్లి పోయినట్లు తెలిపారు.
కాగా నేడు శుక్రవారం 17వ తారీకు రోజున ఉదయం కాటాపూర్ క్రాస్ వద్ద వస్త్ర సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తో వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ పై హర్వాయి వైపు నుండి వస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
కాగా నిందితులు రొయ్యూరు గ్రామానికి చెందిన ఆకుదారి రామయ్య (45), పగిడి జంపయ్య (42) గా నిందితులను గుర్తించినట్లు తెలిపారు. నిందితుల నుండి మోటార్ సైకిల్ హీరో గ్లామర్ టీఎస్ 16 ఈ కే 3264, మూడు తులాల పుస్తెలతాడు, పుస్తెలు హ్యాండ్ బ్యాగ్ మృతురాలి బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డును స్వాధీనం పరుచు కున్నట్లు తెలిపారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిం చినట్లు తెలిపారు. కాగా చాకచక్యంగా వ్యవహరించి అది తక్కువ సమయంలో నిధులను పట్టుకున్న పస్రా సిఐ శంకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఏఎస్సై చింత నారాయణ, హెచ్ సి కిషన్, పిసి పూజారి రమేష్, జాజ సాంబయ్య, అప్పాల రమేష్, గోపు రాజీవ్, కాసగోని రాజేష్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు…