మాట ఇస్తే నిలబెట్టుకుంటా.! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
“తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లతో ముఖ్య సమావేశం”
“పార్టీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సీఎం రేవంత్ రెడ్డి”
“పార్టీకి విజయాన్ని అందించే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు మాటలతో రెచ్చగొట్టిన మౌనం పాటించాం
ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేట్ కర్రీ నాగేంద్రబాబు మాట తీరు”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
హైదరాబాద్ లోని (మాదాపూర్ ) లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ ఏనుముల రేవంత్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ విజయానికి ముందు పార్టీ కోసం కుటుంబ మానసిక మరియు ఆర్థిక సమస్యలను పక్కనపెట్టి పార్టీ కోసం పార్టీ విజయానికి వారధి అయిన ప్రతి ఒక్క కార్యకర్తను మరియు పార్టీ విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తానని ఆనాడు ఆయన పలికిన మాటలను నెరవేర్చుకున్నారని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు తెలిపారు.
ఇదే అంశంలో భాగంగా ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు మాట్లాడుతూ సీఎం రేవంత్ దృష్టికి తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఎదుర్కొనే స్థానిక సమస్యల గురించి మరియు ప్రతిపక్ష పార్టీ నాయకుల విమర్శల గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియా పలు పార్టీల కార్యకర్తలకు తోను మరియు జిల్లా మండల అధికారులతోనూ పార్టీని బలోపేతం చేసే క్రమంలో వారి వేధింపులకు గురవుతున్న విషయాన్ని పార్టీ గుర్తుంచుకొని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరికీ కూడా స్థానిక బలం ఏర్పరిచే విధంగా ప్రభుత్వం దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని ములుగు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు కోరారు.