ఆస్తికోసం తల్లిని, ఇద్దరు కూతుళ్లను హతమార్చిన కసాయి..
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తికోసం.. తల్లి, ఇద్దరు కూతుళ్లను అత్యంత కర్కశంగా చంపేశాడు ఓ కర్కోటకుడు. తల్లాడ మండలం గోపాలపేటలో ఈ దారుణం ఘటన చోటు చేసుకుంది.
గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు. మొదట తన తల్లిని గొంతు నులిమి చంపిన వెంకటేశ్వర్లు.. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత మార్చాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గోపాలపేటకు చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి తగాదాలతో తల్లి పిచ్చమ్మ(60)ను గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెలు నీరజ (10), ఝాన్సీ (6)లను చంపి పరారయ్యాడు.
పొలం తన పేరుపై రాయాలని తల్లిని వెంకటేశ్వర్లు కొన్నేళ్లుగా వేధిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
వెంకటేశ్వర్లు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రెండేళ్ల క్రితం భార్యను హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆమె కోరడంతో.. ఆస్తి మొత్తం ఆమెకు దక్కేలా చేసేందుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగించేలా ఈ నేరానికి పాల్పడినట్టు తెలిసింది.
ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తికోసం.. తల్లి, ఇద్దరు కూతుళ్లను అత్యంత కర్కశంగా చంపేశాడు ఓ కర్కోటకుడు. తల్లాడ మండలం గోపాలపేటలో ఈ దారుణం ఘటన చోటు చేసుకుంది.