భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్..
హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో భూవివాదం జరిగింది. మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కొర్టు వివాదంలో ఉంది.
ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించు కుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కెడ్లను తొలగించారు.
అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. లేదు అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు.కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు.
మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్ది చెప్తున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్తత నెలకొంది.