యువకుడి వినూత్న నిరసన గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయ్యాలంటూ నిరాహారదీక్ష రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని గ్రామ కూడలిలో నిరాహారదీక్షకు దిగాడు. గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురౌతున్నారని, పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో …

యువకుడి వినూత్న నిరసన

గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేయ్యాలంటూ నిరాహారదీక్ష

రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో నవీన్ అనే యువకుడు వినూత్న నిరసనకు దిగాడు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు సమూలంగా నిర్ములించాలని, ఉన్న షాపులన్ని మూసేయ్యలని గ్రామ కూడలిలో నిరాహారదీక్షకు దిగాడు.

గ్రామంలో 24 గంటలు బెల్ట్ షాపులు తెరచి ఉంచుతున్నారని, యువకుల నుండి వృద్ధుల వరకు మద్యానికి బానిసై అనారోగ్యానికి గురౌతున్నారని, పనులు మానేసి తాగడమే పనిగా పెట్టురుకున్నారని, గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తేసే వరకు నిరాహార దీక్షను విరమించనంటూ భీష్మించుకు కూర్చున్నాడు. యువకుడి నిరసనకు గ్రామంలోని మహిళలు మెచ్చుకుంటున్నారు.

Updated On 19 May 2024 9:32 PM IST
cknews1122

cknews1122

Next Story