భర్తను కొట్టారని.. వైన్‌ షాప్‌పై దాడిచేసిన భార్య హైదరాబాద్‌లోని (Hyderabad) మధురానగర్‌లో వైన్స్ షాప్‌ వద్ద ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్‌ షాప్‌ సిబ్బంది దాడిచేయడంతో తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకున్నది.అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. మద్యం కొనేందుకు అక్కడే వైన్‌ షాప్‌ వద్దకు వెళ్లి ఓ వ్యక్తి మద్యం …

భర్తను కొట్టారని.. వైన్‌ షాప్‌పై దాడిచేసిన భార్య

హైదరాబాద్‌లోని (Hyderabad) మధురానగర్‌లో వైన్స్ షాప్‌ వద్ద ఓ యువతి హల్‌చల్‌ చేసింది. మద్యం కొనేందుకు వెళ్లిన తన భర్తపై వైన్‌ షాప్‌ సిబ్బంది దాడిచేయడంతో తన స్నేహితులతో కలిసి ప్రతీకారం తీర్చుకున్నది.అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దాడిచేసిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది.

మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటున్నది. మద్యం కొనేందుకు అక్కడే వైన్‌ షాప్‌ వద్దకు వెళ్లి ఓ వ్యక్తి మద్యం ఇవ్వాలని అడిగాడు. దీంతో అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. మద్యం అడిగిన వ్యక్తిపై వైన్‌ షాప్‌ సిబ్బంది దాడి చేశారు.

ఆ వ్యక్తి తల పగల గొట్టి తీవ్రంగా గాయపరచారు. దీంతో భర్తను రక్తంతో చూసిన భార్య కాసేపు ఏం జరుగుతుందో అర్థంకాలేదు. వైన్‌ షాప్‌ సిబ్బందిని అడ్డుకున్నా ఎవరు మాట వినకపోవడం భర్తపై దాడి చేస్తుండటంతో భర్య రెచ్చిపోయింది.

తన స్నేహితులతో కలిసి వైన్ షాపులోకి జొరబడి సిబ్బందిపై దాడికి దిగింది. బాటిల్స్‌ పగలకొట్టి, ర్యాక్‌లను కొడుతూ, క్యాష్‌ కౌంటర్‌ వద్దకు వచ్చి హడావుడి చేసింది.

స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ పోలీసులని కూడా చూడకుండ జుట్టు పట్టుకుని కొట్టింది.

దాడి చేసిన వారిపై కాకుండా తనను, తన భర్తను అడ్డుకుంటారా? నా భర్తపై తల పగిలేట్టు కొట్టినా మీకు కనిపించడం లేదా? అంటూ ప్రశ్నిస్తూ దాడికి దిగింది. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి.

ఆయా సంఘటనలను ఫొటోలు, వీడియోలు తీస్తుండగా వారిని దుర్భాషలాడుతూ వారి ఫోన్‌ను లాక్కుని కింద పడేసి రాయితో పగలకొట్టానికి ప్రయత్నించింది. కష్టంమీద వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వైన్‌ షాప్‌ సిబ్బందితోపాటు, అడ్డుకునేందుకు వచ్చిన పోలీసులపై దాడి చేసిన మహిళపై వేర్వేరుగా కేసులు నమోదు చేశారు.

Updated On 20 May 2024 6:51 AM IST
cknews1122

cknews1122

Next Story