ప్రభుత్వ ఆసుపత్రి ఎదుటమృతుని బంధువుల ధర్నా
గార్ల: ఆసుపత్రి ఎదుట మృతుని బంధువుల ఆందోళన
గార్ల మండలం తీర్లాపురం గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇస్లావత్ అశోక్ కుటుంబసభ్యులు గార్ల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు.
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అశోక్‌ను ముందుగా ఆసుపత్రికి తీసుకువస్తే చికిత్స చేసే వైద్యులు ఆసుపత్రిలో లేకపోవడం వల్లనే అశోక్ మృతిచెందాడని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించారు.
దీనితో ఆసుపత్రి వద్దకు పోలీసులు చేరుకొని ఆందోళనకారులను ధర్నా విరమించేలా చేశారు.