అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం... గొర్రెల మందలను ఢీకొట్టిన అంబులెన్స్ - -మృతి చెందిన 11 గొర్రెలు,పిల్లలు -చెల్లా చదురైన గొర్రెలు-సుమారు 1.50 లక్షలు నష్టం-తీవ్ర గాయాలు పాలైన గొర్రెల కాపరి ఈశ్వరమ్మ (సికె న్యూస్ గూడూరుప్రతినిధి)రమణయ్య గూడూరు - వెంకటగిరి మార్గంలో ఓ ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డు పై వెళుతున్న గొర్రెల మంద ను ఢీకొట్టిన ప్రమాదంలో 11 గొర్రెలు,పిల్లలు మృతి చెందగా గొర్రెల కాపరి ఈశ్వరమ్మ తీవ్రగాయాలు పాలయ్యింది. స్థానికుల వివరాల మేరకు …

అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం...

గొర్రెల మందలను ఢీకొట్టిన అంబులెన్స్ -

-మృతి చెందిన 11 గొర్రెలు,పిల్లలు

-చెల్లా చదురైన గొర్రెలు
-సుమారు 1.50 లక్షలు నష్టం
-తీవ్ర గాయాలు పాలైన గొర్రెల కాపరి ఈశ్వరమ్మ

(సికె న్యూస్ గూడూరుప్రతినిధి)రమణయ్య

గూడూరు - వెంకటగిరి మార్గంలో ఓ ప్రవేట్ అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా రోడ్డు పై వెళుతున్న గొర్రెల మంద ను ఢీకొట్టిన ప్రమాదంలో 11 గొర్రెలు,పిల్లలు మృతి చెందగా గొర్రెల కాపరి ఈశ్వరమ్మ తీవ్రగాయాలు పాలయ్యింది.

స్థానికుల వివరాల మేరకు వెంకటగిరి నుండి ఓ పేషంట్ ను అత్యవసర చికిత్స నిమిత్తం నెల్లూరు లోని ఓ ఆసుపత్రిలో చేర్చి తిరుగు ప్రయాణంలో వెంకటగిరి కి వెళుతూ గూడూరు మండల పరిధిలోని తిరుపతి గారి పల్లె వద్ద గొర్రెల మందను ఇంటికి తోలుకుని పోతుండగా అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ గొర్రెలను డీ కొట్టారు.

ఈ ప్రమాదంలో సుమారు 11 గొఱ్ఱెలు,పిల్లలు మృతి చెందాయి. రాయచోటికి చెందిన ఈశ్వరమ్మ గొర్రెల మందను తిరుపతి గారి పల్లికి తోలుకుని వచ్చి మేపుకుంటారు.

ఈ క్రమంలో పొలాల్లో మేపుకుని సాయంత్రం ఇంటికి తరలించే క్రమంలో ఈ సంఘటన జరిగింది. దీంతో తీవ్ర గాయాలు పాలైన ఈశ్వరమ్మ, మృతి చెందిన తన గొర్రెలను చూసి రోధించింది. మృతి చెందిన గొర్రెలు సుమారు 1.50లక్షలు రూపాయలు విలువ చేస్తాయని అంచనా వేస్తున్నారు.

Updated On 20 May 2024 10:44 PM IST
cknews1122

cknews1122

Next Story