భార్య బాధితుడి కేసులో ట్విస్ట్ ఇచ్చిన వైఫ్…
తనను చంపేందుకు నా భార్య ప్రయత్నిస్తోందని ఆమె భారీ నుంచి కాపాడాలంటూ అల్వాల్ పోలీసులను ఆశ్రయించిన ఇంగ్లీష్ ప్రొఫెసర్ టెమూజియన్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.తాజాగా ఆయన చేస్తున్న ఆరోపణలు అన్ని అవాస్తవాలని అయన అసలు రూపం మరొకటి ఉందంటూ టెమూజియన్ భార్య మీడియా ముందుకు వచ్చింది.
తాజాగా సోమవారం టెమూజియన్ భార్య లక్ష్మి గౌతమి మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తకు స్టార్ మేకర్ అనే యాప్ లో ఓ అమ్మాయి పరిచయం అయిందని ఆమెతో ఎఫైర్ మొదలైనప్పటి నుంచి మా మధ్య గడొవలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఆ అమ్మాయి కోసం తనను వదిలేసే వరకు వెళ్లారని చెప్పారు. ఒక దశలో ఆ అమ్మాయే నన్ను వేధిస్తున్నారంటూ నా భర్తపై రామగుండం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందన్నారు. ఆయన ఫోన్ కాల్ రికార్డులు, చాటింగ్ హిస్టరీ చూస్తే అంతా తెలుస్తుందన్నారు.
అయనకు నా నుంచి డైవర్స్ కావాలని అందువల్లే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఆస్తి కోసం ఇబ్బంది పెడుతున్నానే మాట అవాస్తవం అని తమ వైపు కుటుంబానికి కూడా మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయని చెప్పారు.
కత్తితో తాను దాడి చేయడం అబద్ధం అని నా మీదే హత్యాయత్నం చేస్తే డిఫెన్స్ చేసుకునే క్రమంలో కొన్ని గాయాలు అయ్యాయే తప్ప ఆయన్ను తాను ఎలాంటి టార్చర్ పెట్టలేదన్నారు. నిజానికి ఆయనే తనను వేధిస్తున్నారని నేను కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ లోని రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురం కు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడు సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా చేస్తూ అల్వాల్ లో భార్యతో కలిసి టెమూజియన్ నివాసం ఉంటున్నారు.
అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తోందని పెద్దల సమక్షంలో చెప్పి చూసినా ఆమె తీరు మారడం లేదని ఇటీవలే తనను చంపెందుకు కత్తితో దాడి కూడా చేసిందని టెమూజియన్ గత రెండు రోజులుగా మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో సోమవారం ఆయన తన భార్యపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయంలో లక్ష్మి గౌతమి సైతం రియాక్ట్ అయ్యరు. పరస్పర ఆరోపణల వరకు వచ్చిన ఈ భార్యభర్తల వ్యవహారంలో పోలీసుల విచారణలో ఏం తేలనుందో చూడాలి.