జిల్లా ఉన్నత అధికారి ఆదేశాల కోసం ఎదురుచూపులు చూస్తున్న కార్మికులు!
“అయ్యా సారు మేమేం పాపం చేశాం.! జర మా గోడు విను సారు.!”
“కానోడికి కంచం.! అయినోడికి ఇస్తార.! ఇదేం వింత సారు”
“ఇసుక లారీలకు సలాం, ఊర్లో ట్రాక్టర్లకు సంకెళ్లు”
“రైతన్న పంట పొలాల మట్టి సదునుకు సైతం నోచుకోని రెవెన్యూ చట్టాలు “
“వెంకటాపురం మండలంలో ఇసుక కోరతతో ఆకలి బాధలు ఎదుర్కొంటున్న కార్మికులు”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో ఇటీవల రెవెన్యూ శాఖ తీసుకున్న కీలక నిర్ణయానికి సతమతమవుతున్న కార్మిక సేన. ఈ మధ్య కాలంలో వెంకటాపురం మండలంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక ట్రాక్టర్ల యాజమాన్యం వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణ గూర్చి ఇసుక ట్రాక్టర్ల పై మండల తాసిల్దార్ వరుస దాడులు నిర్వహించారు.
ప్రభుత్వ ఆంక్షలు కు వ్యతిరేకంగా అనుమతి లేకుండా అక్రమంగా గోదావరి పాయ నుంచి ఇసుకను తెచ్చి విక్రయిస్తున్నారని మండల తాసిల్దార్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక రవాణాకు పాల్పడ్డ ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఒక్కసారిగా వెంకటాపురం మండలంలో ఇసుక ట్రాక్టర్ల రవాణా ఆగిపోవడంతో కార్మికులు ఉపాధి లేక ఒక్క పూట కూలికి పోయి పొట్ట గడుపుకునేందుకు సైతం పని కరువైందంటూ మీడియాని ఆశ్రయించారు.
రెవెన్యూ శాఖలో ట్రాక్టర్ల ఇసుక రవాణాకు సంబంధించి సరేనా పర్మిషన్స్ గూర్చి స్వష్టత లేక. రెవిన్యూ సిబ్బందికి ఇసుకతో ఎదురుపడలేక మండలంలో ఇసుక లేక చిరు కట్టడలు నిలిచిపోయాయి. ఇసుక ఉంటేనే ఉపాధి ఉంటదని ఇసుకతోటే” పలు రకాల చేతి కార్మికులకు ఉపాధి ఉంటదని కార్మికులంతా రోడ్డును ఆశ్రయించిన పరిస్థితులు వెంకటాపురం మండలంలో నెలకొన్నాయి.
అంతేకాకుండా ఇతర జిల్లాల నుంచి ఇతర పట్టణాల నుంచి కేవలం ఒక డిడి పేరుతో టన్నుల కొలది ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నప్పటికీ వాటిపై ప్రభుత్వం ఆంక్షలు సరిగ్గా విధించబోగా, స్థానిక వనరులు స్థానికులకు ఉపయోగకరంగా సానుకూలంగా లేకపోవడంపై కార్మికులంతా తమ గోడును మీడియా ముఖంగా బహిర్గత పరిచారు.
ఇది ఇలా ఉండగా ఒకపక్క వ్యవసాయ నిమిత్తం కొనుక్కున్న ట్రాక్టర్లు, ఈ సంవత్సరం పంట సరిగ్గా పండగ దిగుబడి సరిగ్గా లేక ట్రాక్టర్ల వాయిదాలైన వెళ్తాయి అన్న ఉద్దేశంతో స్థానిక రైతులంతా కూడా ఇసుక తోలకాలపై మొగ్గు చూపుతున్నప్పటికీ ఇసుక రవాణా పరిమిషన్లో అటు జిల్లా నుంచి ఇటు మండలం నుంచి అనుమతుల గూర్చి స్వష్టత లేకపోవడంతో మండలంలో ఇసుక తోలకాలు నిలిచిపోయాయి
దయచేసి ప్రభుత్వం మండల ఇసుక తోలకాలపై వ్యవసాయ భూముల మట్టి సదును విషయమై ఒక స్వష్టత కల్పించాలని జిల్లా ఉన్నతాధికారికి మీడియా ద్వారా వినిపిస్తున్నామని తెలిపారు ఇకనైనా కార్మికులపై దయవుంచి మండల ఇసుక రవాణా కు ఆంక్షలు నిలిపివేసి తలకాలు కొనసాగించేందుకు అనుమతి కల్పించాలంటూ బాధితులంతా మీడియా ముఖ్యంగా వాపోయారు.