Telangana

పరాయి స్త్రీలతో సహజీవనం…SI , కానిస్టేబుల్ ల సస్పెన్షన్

పరాయి స్త్రీలతో సహజీవనం…SI , కానిస్టేబుల్ ల సస్పెన్షన్

పరాయి స్త్రీలతో సహజీవనం…SI , కానిస్టేబుల్ ల సస్పెన్షన్

పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి.శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్.ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఇరువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు రావడంతో పాటు ఎస్.ఐ నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసినట్లుగా వివిధ మీడియా మధ్యమాల్లో ప్రచారం అయ్యింది.

దీంతో ఈ ఘటనపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎస్. ఐ, కానిస్టేబుల్ పరాయి స్త్రీ లతో సహజీవనం చేస్తున్నందుకు ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ జి పి ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button